ఎవరెన్ని వదంతులు పుట్టించినా.. అతడితోనే తలవంచి తాళి కట్టించుకుంటానని చెబుతోంది స్టార్ హీరోయిన్ అనుష్క. 2005లో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. నటిగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లో 'రెండు' అనే సినిమాతో పరిచయమైంది.

అందులో మాధవన్ తో రొమాన్స్ చేసిన అనుష్క ఆ తరువాత ఇన్నేళ్లకు 'నిశ్శబ్దం' అనే చిత్రంలో మళ్లీ ఆయనకి జంటగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీపై రూమర్స్ కూడా అదే రేంజ్ లో వినిపిస్తుంటాయి.

వైరల్ న్యూస్ : టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి..?

ఆ మధ్య నటుడు ప్రభాస్ తో వరుసగా సినిమా చేయడంతో అతడితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని వీరిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా.. వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ తరువాత ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తుందనే ప్రచారం జరిగింది.

ఇటీవల ఓ క్రికెటర్ తో అనుష్క పెళ్లి అంటూ రూమర్లు వినిపించాయి. ప్రేమ, పెళ్లి అంటూ తనపై వస్తోన్న రూమర్లపై అసహనం వ్యక్తం చేసింది అనుష్క. తన గురించే ఇలా ఎందుకు వదంతులు పుట్టిస్తున్నారో అర్ధం కావడం లేదని వాపోయింది.

తనపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని చెప్పారు. తన పెళ్లి గురించి తన తల్లితండ్రులే నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. వాళ్లు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో తననే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇకనైనా.. అనుష్కపై ఈ అసత్య ప్రచారాలు ఆగుతాయో లేదో చూడాలి!