టాలీవుడ్ టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గురంచి రోజుకో సెన్సేషన్ న్యూస్ మీడియాలో వస్తూ సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ సంచలన వార్త  గా మారింది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 210 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా అమ్మకం కూడా ఓ స్దాయిలో జరిగిందని తెలుస్తోంది. ఓరస్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు లాక్ చేసుకున్నారు.  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ..250 కోట్లకు అమ్మారంటున్నారు. స్టార్ గ్రూప్ వారు అన్ని భాషల డిజిటల్ రైట్స్ ఈ పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు.

అంటే థియోటర్ బిజినెస్ కన్నా డిజిటల్ బిజినెస్ ఎక్కువ జరిగిందన్నమాట. పది భాషల్లో ఒకే సారి రిలీజ్ అవుతున్న చిత్రం కాబట్టి ఆ రేటు పలకటంలో వింతేమీ లేదంటున్నారు.  ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8, 2021 న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం.  రాజమౌళి సినిమాల్లో క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్ .. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.