Asianet News TeluguAsianet News Telugu

`ఆర్ఆర్ఆర్‌` అంతా కల్పితమే.. తేల్చేసిన రాజమౌళి..!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పూర్తిగా కల్పిత కథే అని చెప్పాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు తమ యుక్త వయసులో కొన్నేళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఉత్తరాదిలో గడిపారు. అయితే ఆ సమయంలో వారు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అన్న ఆలోచనతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా చెప్పాడు రాజమౌళి.

SS Rajamouli About RRR Story
Author
Hyderabad, First Published Apr 18, 2020, 11:15 AM IST

ప్రస్తుతం దేశంలోనే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ఆర్‌ ఆర్ ఆర్‌. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాడు రాజమైళి. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చారిత్రక పాత్రలను రాజమౌళి ఎలా తెరకెక్కించబోతున్నాడన్న చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయంలో  క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమా కథా కథనాల విషయంలో ఉన్న అనుమానాలకు చెక్‌ పెట్టాడు రాజమౌళి.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పూర్తిగా కల్పిత కథే అని చెప్పాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు తమ యుక్త వయసులో కొన్నేళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఉత్తరాదిలో గడిపారు. అయితే ఆ సమయంలో వారు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అన్న ఆలోచనతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా చెప్పాడు రాజమౌళి. ఇక సినిమా వర్క్ విషయానికి వస్తే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన భాగం ఎడిటింగ్ కూడా పూర్తయ్యిందని వెల్లడించాడు రాజమౌళి.

Follow Us:
Download App:
  • android
  • ios