బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హా 2010లో దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సోనాక్షి కుర్రకారుని తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. తొలి చిత్రంతోనే సోనాక్షి బాలీవుడ్ లో స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. 

సోనాక్షి సిన్హా విమర్శలకు అంతగా స్పందించదు. కానీ మితిమీరినప్పుడు సరైన విధంగా కౌంటర్ ఇస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రాకాసి కరోనా గురించే అంతటా చర్చ జరుగుతోంది. లక్షలాది మంది కరోనా వైరస్ బారీన పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు నమోదవుతున్నాయి. 

దీనితో కరోనాని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకు పలువురు సెలెబ్రిటీలు విరాళాలు అందిస్తున్నారు. బాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. కానీ సోనాక్షి సిన్హా మాత్రం విరాళం ప్రకటించినట్లు ఎక్కడా వార్తల్లో రాలేదు. దీనితో నెటిజన్లు సోనాక్షి సిన్హాని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. 

నయనానందమే ఈ బోల్డ్ బ్యూటీ అందాలు(హాట్ ఫోటోస్)

కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ కూడా కరోనాని ఎదుర్కొనేందుకు ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదని మండిపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన సోనాక్షి సిన్హా తగు రీతిలో సమాధానం ఇచ్చింది. విమర్శకుల నోళ్లు మూయించింది. 

తాను ప్రచారం చేసుకోనంత మాత్రాన సహాయం చేయలేదని భావించడం మీ అవివేకం. నన్ను ట్రోల్ చేస్తున్న వారికోసం ఒక నిమిషం మౌనం పాటిస్తున్నా. విరాళాలు ఇచ్చినప్పుడు, ఇతర సహాయాలు చేసినప్పుడు ప్రచారం చేసుకోవాలా వద్ద అనేది నా వ్యక్తిగత విషయం. నాపై ట్రోల్ చేసేకంటే  సమయాన్ని మంచి పని కోసం ఉపయోగించండి అని సోనాక్షి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.