ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వివాదాస్పద నటి సోఫియా హయాత్‌. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ తరువాత వరుస వివాదాలతో సంచలనం సృష్టించింది. గతంలో నన్‌గా మారుతున్నట్టుగా ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే సోఫియా తీసుకున్న ఆ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. తాజాగా ఓ న్యూడ్ ఫోటోను పోస్ట్ చేసి మరోసారి వివాదాల్లో చిక్కుకుంది ఈ భామ.

సోఫియా సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయటం కొత్తేం కాదు. అయితే తాజాగా పోస్ట్ చేసిన న్యూడ్‌ ఫోటో వివాదాస్పదం అవ్వటం వేనుక ప్రత్యేక కారణమే ఉంది. హిందువులు పవిత్రంగా భావించే ఓం ముందు న్యూడ్‌ గా నిలుచున్న ఫోటోను పోస్ట్ చేసింది సోఫియా. అంతేకాదు ఈ భామ తనను తాను నగ్న దేవతగా ప్రకటించుకోవటం పట్ల కూడా కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోపై నెటిజెన్లు మండిపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ పై ఓ వ్యక్తి పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు. `ఆన్‌లైన్‌ ద్వారా సోఫియా హయత్‌పై కంప్లయింట్ ఇచ్చాను. హిందువుల మనోభావాలు కించపరుస్తూ హిందూ దేవతలను అవమానకరంగా పోస్ట్ లు పెట్టిన ఇలాంటి వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను` అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. తరువాత మరో పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సోఫియా.. నాకు హిందూ ఇజం, ఇస్లాం రెండూ ఇష్టమే. కొంత మంది నగ్నత్వాన్ని తప్పుగా భావిస్తున్నారు` అంటూ కామెంట్ చేసింది.