ప్రముఖ నటి శ్వేతా తివారి బుల్లితెరపై, వెండి తెరపై మెరిసింది. ప్రస్తుతం శ్వేతా తివారి వయసు 39 ఏళ్ళు. ఈ వయసులో కూడా శ్వేతా తివారి మతి పోగొట్టే అందంతో మెరిసిపోతోంది. శ్వేతా తివారి బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ షోలో ఆమె విజేతగా నిలవడం విశేషం. 

ఇక శ్వేతా తివారి వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. శ్వేతా తివారి 1998లో రాజా చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 2012లో ఈ జంట విడిపోయారు. 2013 శ్వేతా తివారి టివి నటుడు అభినవ్ కోహ్లీని రెండో వివాహం చేసుకుంది. గత ఏడాది అతడి నుంచి కూడా శ్వేతా తివారి విడిపోయింది.

 

ప్రస్తుతం శ్వేతా తివారి సింగిల్ గా తన పిల్లలతో జీవిస్తోంది. రెండు సార్లు తన వైవాహిక జీవితంవిఫలం కావడంతో ప్రతి ఒక్కరూ తననే విమర్శిస్తున్నారని, కానీ ఆ విమర్శలకు తాను కుంగిపోనని శ్వేతా తివారి పేర్కొంది. నాకు భాద్యతలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా లైఫ్ లీడ్ చేస్తున్నా. 

నన్ను విమర్శించే వారికీ ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నా. తీవ్రమైన నష్టం కలిగే ప్రదేశం నుంచి పక్కకు తప్పుకోవడమే మంచింది. నా విడాకులు కూడా అలాంటివే. నాకున్నఒక చేయి పనిచేయకుంటే నా జీవితమే ఆగిపోయినట్లా.. మరో చేయితో పని చేసుకుంటాం. పెళ్లి కూడా అంతేనని శ్వేతా అభిప్రాయపడింది. 

చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని భర్త ఉండి కూడా సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు. వాళ్ళకంటే నేను చాలా బెటర్ అని శ్వేతా తెలిపింది. నేను ధైర్యంగా నా జీవితంలో సంగతులు చెప్పగలను శ్వేతా బోల్డ్ కామెంట్స్ చేసింది. శ్వేతా తివారీకి ప్రస్తుతం ఓ పాప, బాబు ఉన్నారు.