బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ పై మీటూ ఆరోపణలు వస్తున్నాయి. అనుమాలిక్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోనా మొహాపాత్రా, శ్వేతా పండిట్ లాంటి సింగర్స్ ఆరోపణలు చేశారు. ఇటీవల మరో సింగర్ నేహా భాసిన్ కూడా అనుమాలిక్ పై ఆరోపణలు చేసింది.

అతడు కామాంధుడని తనను వేధింపులకు గురి చేశాడని నేహా భాసిన్ కామెంట్స్ చేసింది. అయితే మొదటిసారి ఓ గాయని అనుమాలిక్ చాలా మంచి వ్యక్తి అని, టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తుంటాడని.. అతడిపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతోంది.

''ఆ కామాంధుడు నన్ను కూడా విడిచిపెట్టలేదు..'' సింగర్ కామెంట్స్!

ఇంతకీ ఆ సింగర్ ఎవరంటే.. హేమా సర్దేశాయ్. బాలీవుడ్ లో సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న హేమా.. అనుమాలిక్ ఎందరో పేరున్న సింగర్స్ కి కెరీర్ ఆరంభంలో పాటలు పాడే ఛాన్స్ ఇచ్చారని.. ఆ సింగర్స్ లో తను కూడా ఒకదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. టాలెంట్ చూసిన మాత్రమే అవకాశాలిచ్చే మంచి మనిషి అనుమాలిక్ అంటూ పేర్కొంది. అతడిపై 
ఆరోపణలు చేస్తోన్న సింగర్స్ ని 'ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉన్నారని' ప్రశించింది.

పబ్లిసిటీ కోసం అనుమాలిక్ పై రాళ్లు విసురుతున్నారా..? అంటూ ఫైర్ అయింది. ఇది కరెక్ట్ కాదంటూ మండిపడింది. తను పబ్లిసిటీ కోసం అనుమాలిక్ కి సపోర్ట్ చేయడం లేదని.. మద్దతు తెలిపితే ఉండే సంతృప్తి ఏంటో తెలుసుకోండి అంటూ తెలిపింది.

హేమా పెట్టిన పోస్ట్ చూసిన సింగర్ శ్వేతా పండిట్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇది సిగ్గుచేటు చర్య అంటూ హేమా మాటలపై మండిపడింది. 'ఆమె చెప్పేది ఎలా ఉందంటే.. చైల్డ్ అబ్యూస్, అత్యాచారానికి గురయ్యేవారు స్వయంగా కావాలని వెళ్లి రేప్ చేయించుకున్నట్లుగా ఉందని.. అసలు నువ్వేం అనుకుంటున్నావ్' అంటూ సింగర్ హేమాని ప్రశ్నించింది. ఒక ఆడది అయి ఉండి మరో ఆడదాన్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా దరిద్రంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది.