సౌత్ లో శ్రీయ శరన్ అగ్ర హీరోలందరితో నటించింది. ఎక్కవకాలం తిరుగులేని స్టార్ గా రాణించింది. సౌత్ లో శ్రీయ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది.  పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో కూడా శ్రీయ నటించింది. 

2018లో శ్రీయ తన రష్యన్ ప్రియుడు కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. ఇక శ్రీయ అయితే వివాహం తర్వాత కూడా అందాలు ఆరబోస్తూ సినిమాలు చేస్తోంది. 

 

శ్రీయకు సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. శ్రీయ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యోగా వీడియో కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉంది. యోగ, సైన్స్ కు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ శ్రీయ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రీయా తన హాట్ అండ్ ఫిట్ అందాలతో కనువిందు చేస్తోంది. 

ప్రస్తుతం శ్రీయ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా శ్రీయ, ఆమె భర్త కొశ్చివ్ స్పెయిన్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.