నేటి తరానికి తగ్గట్టుగా నడుచుకోవాలంటే డిఫరెంట్ గా ఆలోచించాలి. అందుకు ఉదాహరణగా నిలిచిన హీరో విజయ్ దేవరకొండ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ చాలా వేగంగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో రౌడీ బాయ్ ఫెడవుట్ అవుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. పైగా విజయ్ సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి.

డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు ఇటీవల వచ్చిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఒకప్పుడు ప్రమోషన్స్ తో హడావుడి చేసిన విజయ్ హవా ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. విజయ్ సినిమా ఒకటి ఆగిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ కొన్ని రోజుల క్రితం హీరో అనే సినిమా స్టార్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో డైరెక్టర్ ఆనంద్ అణ్ణమలై తెరక్కిస్తున్న ఆ సినిమాలో విజయ్ బైక్ రైడర్ గా కనిపించనున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

అయితే స్క్రిప్ట్ విషయంలో చేసిన మార్పులపై విజయ్ సంతృప్తి చెందకపోవడంతో సినిమా ఆగిపోయినట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మరొకసారి సోషల్ మీడియాలో రౌడీ స్టార్ కెరీర్ పై అనేక రకాల ట్రోల్స్, కామెంట్స్ వస్తున్నాయి.. ఇకపోతే నెక్స్ట్ విజయ్ పూరి జగన్నాథ్ సినిమాతో ఫైటర్ గా దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.