టీవి ఛానెల్ లైవ్ లు ఒక్కోసారి తమ ప్రమేయం లేనట్లుగా ఉంటున్నాయి సదరు ఛానెన్స్. పచ్చి బూతులు మాట్లాడినా వారించే పరిస్దితి కనపడటంలేదు. అదే సమయంలో టీవి ఛానెల్ లో తనను చాలా మంది చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా నోటికి ఏమి వస్తోందో తెలియకుండా సెలబ్రెటీలు కూడా బిహేవ్ చేస్తూండటం చూసేవారికి వెగటు పుట్టిస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్ లో లైవ్ కు వచ్చిన శివాజి..పచ్చి బూతులతో రెచ్చిపోయి షాక్ ఇచ్చాడు. ఆ బూతు దండకం ఇప్పుడు వైరల్ గా మారింది.
 
రీసెంట్ గా అమరావతి గురించి ఓ టీవి ఛానెల్ లో లైవ్ లోకి వచ్చాడు శివాజి. ఆయన ..లైవ్ లో వచ్చే కాలర్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఓ కాలర్ మాట్లాడుతూ...తనది గుంటూరు అని, శివాజి ఊరే నని చెప్తూ ఓ మాట అన్నాడు. శివాజి వయస్సులో ఉన్నప్పుడు చెల్లి వరస అమ్మాయిని లేపుకు వచ్చాడని, అలాంటి విలువలు లేని వ్యక్తి మాటలు పట్టించుకుంటామని, అలాంటి వ్యక్తిని టీవీ ఛానెల్ లైవ్ కు తీసుకురావద్దని అన్నాడు.

స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

అది విన్న శివాజి...తాను ఓ సెలబ్రెటీనని ఓ పార్టీ తరుపున మాట్లాడుతున్నానని మర్చిపోయాడు. విచక్షణ వదిలేసి..అవతల మాట్లాడిన కాలర్ కు ఏ మాత్రం తగ్గకుండా బూతులు మొదలెట్టాడు. లం. కొడకా అంటూ మొదలెట్టి బూతు పంచాంగం విప్పాడు. ఇలా కాలర్ రూపంలో వచ్చింది మరెవరో కాదని వైయస్ ఆర్ కాంగ్రేస్ కు చెందిన వాడేనని అన్నారు. ఇంకా చాలా సేపు తన గురించి గొప్పలు చెప్తూ..బూతులు మాట్లాడాడు. ఇది విన్న వాళ్లంతా ఇదేంటి శివాజి ఇంతలా దిగజారిపోయాడని అంటున్నారు.
 
అదే సమయంలో రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే వైఎస్ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని హీరో శివాజీ ఆరోపించారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకే రాజధాని మార్పు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు కుల పిచ్చి ఉంటే... కమ్మవాళ్లున్న చోటే కియా మోటార్స్‌ పెట్టేవాళ్లు కదా అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే తెలుగుదేశం నేతలను జైలులో పెట్టాలని సూచించారు.