సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొడుగు కాళ్ళ సుందరిగా అభిమానులు శిల్పాని పిలుచుకుంటారు. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాలకు దూరమైంది. తిరిగి ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొడుగు కాళ్ళ సుందరిగా అభిమానులు శిల్పాని పిలుచుకుంటారు. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాలకు దూరమైంది. తిరిగి ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
2009లో శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దంపతులకు వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా మరోసారి శిల్పా శెట్టి తల్లి అయింది. ఈ శుభవార్తని శిల్పా శెట్టి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఇన్నేళ్ల మా ప్రార్ధనలు ఫలించాయి. మా జీవితాల్లోకి ఏంజిల్ లాంటి పాపాయి వచ్చింది అంటూ పేరు కూడా శిల్పా శెట్టి ప్రకటించింది. తమ పాపకు ' సమిషా శెట్టి కుంద్రా' అని పేరు పెట్టారు. ఈ పేరుకు శిల్పా శెట్టి అర్థం కూడా వివరించింది. 'స అంటే సంస్కృతంలో కలిగి ఉండడం.. మిష అంటే రష్యన్ లో దేవత. మొత్తంగా మా ఇంటి లక్ష్మి తమ జీవితాలని పరిపూర్ణం చేసింది అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 15 పాప జన్మించినట్లు శిల్పా శెట్టి తెలిపింది. ఇటీవల శిల్పా శెట్టి గర్భవతిగా ఉన్న ఫోటోలు కానీ, దృశ్యాలు కానీ ఎక్కడా కనిపించలేదు. శిల్పా శెట్టి నాజూగ్గానే కనిపించింది. కానీ పాపకు ఎలా జన్మనిచ్చింది అనే సందేహం రావచ్చు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు సరోగసి పద్దతిలో ఈ పాపకు జన్మనిచ్చారు.
తెలుగు ప్రేక్షకుల శిల్పా శెట్టి సాగర కన్యగా ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటన అద్భుతం. మరికొన్ని తెలుగు చిత్రాల్లో కూడా శిల్పా శెట్టి నటించింది.