Asianet News TeluguAsianet News Telugu

నా కూతురు మన మతం ఏంటని ప్రశ్నించింది : షారుఖ్ ఖాన్

ఈ షోకి అతిథిగా హాజరైన షారుఖ్ సందర్భం రావడంతో మతాల గురించి మాట్లాడారు. తను ముస్లిం అని, తన భార్య హిందూ అని చెప్పిన షారుఖ్ తన పిల్లలు ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకున్నారు. తమది హిందూస్తాన్ అని.. కులమతాలకు అతీతంగా తన పిల్లలను పెంచుతున్నానని చెప్పారు. 

Shah Rukh Khan's Response To Young Suhana's 'What's Our Religion' Question
Author
Hyderabad, First Published Jan 27, 2020, 4:44 PM IST


ప్రస్తుతం ఇండియన్ ట్రెండ్స్ లో టాప్ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచారు. ఈ 54 ఏళ్ల నటుడు మతాల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోను షారుఖ్ ఖాన్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ హీరో 'డాన్స్ ప్లస్ 5' అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షోకి అతిథిగా హాజరైన షారుఖ్ సందర్భం రావడంతో మతాల గురించి మాట్లాడారు. తను ముస్లిం అని, తన భార్య హిందూ అని చెప్పిన షారుఖ్ తన పిల్లలు ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకున్నారు.

తమది హిందూస్తాన్ అని.. కులమతాలకు అతీతంగా తన పిల్లలను పెంచుతున్నానని చెప్పారు. తన కూతురు సుహానా చిన్నతనంలో అడిగిన ఓ ప్రశ్నని గుర్తు చేసుకున్నాడు షారుఖ్. సుహానా స్కూల్ లో చదువుకునే రోజుల్లో.. అప్లికేషన్ ఫారంలో రెలిజియన్ సెక్షన్ నింపడానికి 'పాపా.. మన మతం ఏంటి..?' అని షారుఖ్ ని అడిగిందట.

దానికి షారుఖ్ మనం ఇండియన్స్ అని చెప్పి.. అప్లికేషన్ లో కూడా అలానే రాశారట. అంతేకాదు.. మనకి మతం అనేది లేదని చెప్పారట. ఆ విషయాన్ని ఆడియన్స్ తో స్టేజ్ మీద ఉన్న జడ్జిలతో చెప్పుకుంటూ గర్వంగా ఫీల్ అయ్యారు షారుఖ్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

గతంలో కూడా షారుఖ్ మతాలపై స్పందించారు. రీజనల్ ఫీలింగ్స్ అనేవి అంధకారంలోకి నెట్టేస్తాయని చెప్పారు. తినే తిండిని బట్టి మతాలను డివైడ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. షారుఖ్ చివరిగా నటించిన సినిమా 'జీరో'. ఈ సినిమా తరువాత మరే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు.   

 

Follow Us:
Download App:
  • android
  • ios