బాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోంది. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా బాలీవుడ్ ను ఏలుతున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉండగా.. షారుక్ మాత్రం వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్నాడు. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని ఓ భారీ చిత్రం తో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.

నిర్మాతగా మారిన నటుడు నిఖిల్ అద్వానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథను ఫైనల్ చేసిన నిఖిల్, ప్రస్తుతం హీరోల ను ఒప్పించే పనిలో ఉన్నాడు. ఒక్కసారి హీరోలు ఓకె అంటే అఫిషియల్ అన్నౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు సల్మాన్ షారుఖ్ లు అంగీకరిస్తారా లేదా అని చూడాలి.

దర్శకుడుగా ధూమ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నిఖిల్, సల్మాన్ షారుఖ్ ల కోసం మరో భారీ ప్రాజెక్ట్ ను రెడీ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతం లో సల్మాన్ షారుఖ్ లు కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోత హై, హం తుంహరే హై సనం లాంటి సినిమా ల్లో కలిసి నటించారు. ఇటీవల సల్మాన్ ట్యూబ్ లైట్ లో షారుఖ్, షారుఖ్ జీరో లో సల్మాన్ లు అతిధి పాత్రలలో నటించారు. మరి మరో సరి ఈ ఇద్దరు స్టార్ లు ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తారేమో చూడాలి.