సినిమా సినిమాకి తన రెమ్యునరేషన్ పెంచుకునే మహేష్ బాబు కథల విషయంలో మాత్రం కొత్తదనం చూపించలేకపోతున్నాడు. 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' లాంటి సినిమాలతో భారీ డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకున్న మహేష్ పాత్రల పరంగా వెరైటీ చూపించడం లేదు.

మహేష్ తో సినిమాలు తీసే దర్శకులు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో రొటీన్ కథలైనప్పటికీ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయే కానీ మహేష్ రేంజ్ కి తగ్గట్లుగా ఉండడం లేదు. నిజానికి మహేష్ బాబు సినిమా హిట్ అయితే.. మరో సినిమాకి స్పేస్ ఉండదని. అలాంటిది అతడితో పాటు రిలీజయ్యే సినిమాల వెనుక ఉండాల్సిన పరిస్థితి కలుగుతోంది.

అక్కడ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ భారీ డ్రాప్!

'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాలు హిట్లే అయినప్పటికీ అలాంటి సినిమాల వలన మహేష్ స్థాయి మాత్రం పెరగడం లేదు. తన మార్కెట్ స్టాండర్డ్ గా ఉంటుందే తప్ప విస్తరించడం లేదు. 'స్పైడర్' సినిమాతో పాన్ సౌత్ ఇండియా సినిమా చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టడంతో మహేష్ ఆలోచనలో పడ్డాడు.

సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ చేసుకొని అనీల్ రావిపూడితో కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందని సాదాసీదా కథను ఎన్నుకున్నాడు. ఈ సినిమా వసూళ్లను తీసుకురాగలిగిందే కానీ మహేష్ స్టార్ డమ్ కి బూస్టప్ ఇవ్వలేకపోయింది.

ఇండస్ట్రీలో మిగిలిన హీరోలంతా మహేష్ కంటే పెద్ద హిట్లు కొట్టేస్తూ తమ సత్తా చాటుతున్నారు. మరి మహేష్ ఇప్పటికైనా.. కొత్త కథలు ఎన్నుకుంటాడా..? లేక ఇలాంటి అత్తెసరు కథలతో సరిపెట్టేస్తాడో చూడాలి!