Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒక్క సీన్ కోసం 8కోట్లా.. సల్మాన్ రేంజ్ మాములుగా లేదు!

సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల దబాంగ్ సినిమాకి వేగంగా  ఫినిషింగ్ టచ్ ఇచ్చి చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు

salman khan radhe cinema latest update
Author
Hyderabad, First Published Jan 28, 2020, 9:58 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల దబాంగ్ సినిమాకి వేగంగా  ఫినిషింగ్ టచ్ ఇచ్చి చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు గాని అనుకున్నంత స్థాయిలో పూర్వ వైభవాన్ని చూపించలేకపోయారు.

ఇక ఆ సినిమా రిలీజ్ కాక ముందే రాధే సినిమాను సెట్స్ పైకి తెచ్చేశాడు. ఈద్ కానుకగా ఆడియెన్స్ కి సినిమాని ఇస్తానని చెప్పిన సల్మాన్ పక్కా ప్లానింగ్ తో రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ సరికొత్తగా కనిపించబోతున్నాడట. మెయిన్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం 8కోట్ల వరకు ఖర్చు చేయిస్తున్నాడట. గతంలో బాహుబలి కి వర్క్ చేసిన కొంత మంది విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు కూడా అదే తరహాలో గ్రాఫిక్స్ ని క్రియేట్ చేయబోతున్నారట.

ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే మొదట కోట్ల బడ్జెట్ ని ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ ఆ  తరువాత క్వాంటిటీ కోసం మరో మూడు కోట్లు పెంచుతున్నారట.      పొగరున్న పోలీస్ ఆఫీసర్ గా దబాంగ్ సిరీస్ లతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న కండల వీరుడు రాధే సినిమాతో ఎలాంటి కిక్ ఇస్తాడో అని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగంగా ఫినిష్ చేయాలనీ సల్మాన్ ఫిక్స్ అయ్యాడు.

ప్రభుదేవా - సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా వాంటెడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు దబాంగ్ 3 అనంతరం 2020 ఈద్ కి రాధే సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యారు.డిసెంబర్ లో దబాంగ్ 3 రిలీజ్ అనంతరం ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెంచారు. అంటే 5నెలల్లో సినిమాను పూర్తి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు. అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఈద్ ని మిస్ చేసుకోకూడదని సల్మాన్ గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమాతో సల్మాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios