Asianet News TeluguAsianet News Telugu

“సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

Saaho's Hindi TV premiere garners huge points
Author
Hyderabad, First Published Feb 16, 2020, 5:13 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. పాన్ ఇండియాగా రిలీజైన ఈ సినిమా నార్త్ లో అదీ కొన్ని ఏరియాల్లో తప్ప ఎక్కడా ఆడలేదు. అయితే బాలీవుడ్ లో దీన్ని బ్లాక్ బస్టర్ చిత్రంగా డిక్లేర్ చేసారు.  తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను జనవరి 26 ఆ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా  జీ సినిమా వారు  టెలికాస్ట్ చేసారు.

రిపబ్లిక్ డే కానుకగా ఈ షో ను టెలికాస్ట్ చేస్తే ఓ రేంజిలో  టీఆర్పీలు వచ్చాయి.బార్క్(బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) లెక్కలు ప్రకారం  128.20 లక్షల  వ్యూయర్ షిప్ వచ్చింది. ఇది చాలా అద్బుతమైన రెస్పాన్స్ . అంతకు ముందే నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ , 2019న ఈ సినిమాని ప్రీమియర్ చేసారు. అయినా ఆ ఇంపాక్ట్ ...టీఆర్పీ పై పడకపోవటం ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ కు హిందీ మార్కెట్ లో ఉన్న స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ అయ్యిందంటున్నారు అభిమానులు. నిజమే కదా.

నితిన్ అత్తా మామల షాకింగ్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే..

మరో విషయం ఏమిటంటే...ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాహోనే టాప్ ప్లేస్ లో నిలిచింది.  సాహూ అత్యధిక రేటింగ్స్ సాధించిన హిందీ సినిమాలలో ఐదో ర్యాంకుకు చేరింది.సల్మాన్ ఖాన్ భారత్, హ్రితిక్ రోషన్ సూపర్ 30 కంటే సాహూ కే ఎక్కువ రేటింగ్స్ రావడం గమనార్హం.   సాహో చిత్రం థియేటర్ల లో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూసి కూడా మళ్లీ చాలా మంది ప్రేక్షకులు జీ సినిమా ఛానెల్ లో చూసేందుకు ఇంట్రస్ట్ చూపడం వల్లే ఈ స్థాయి రేటింగ్ నమోదు అయ్యింది. సాహో చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్థానంను మరింత పదిలం చేసుకున్నాడు..

Follow Us:
Download App:
  • android
  • ios