రాబర్ట్ పాటిన్సన్ అంటే మన వాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 'ట్విలైట్' సినిమా హీరో అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది. ఈ సినిమాతో హాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఫేమస్ అయ్యాడు ఈ హీరో. ఇప్పుడు ఆయన 'ది బ్యాట్ మ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

గతంలో బ్యాట్ మ్యాన్ గా హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నటించారు. ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కొన్ని కారణాల వలన అతడిని తప్పించి రాబర్ట్ పాటిన్సన్ ని నియమించారు. మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని ఈ సినిమా రిజల్ట్ కోసం ఇప్పటినుండే టెన్షన్ పడుతున్నాడు హీరో రాబర్ట్ పాటిన్సన్.

హీరోయిన్ తో వర్మ రొమాంటిక్ డాన్స్.. వైరల్ అవుతోన్న వీడియో!

ఈ సినిమా గనుక ఆడకపోతే తను మరో కెరీర్ ని సిద్ధంగా పెట్టుకున్నానని అన్నారు. ఇంతకీ ఆ కెరీర్ ఏంటోతెలుసా.. పోర్న్ ఇండస్ట్రీ. 'ది బ్యాట్ మ్యాన్' సినిమా గనుక హిట్ అవ్వకపోతే పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోతానని అంటున్నాడు రాబర్ట్ పాటిన్సన్. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమాకి రాబర్ట్ న్యాయం చేస్తాడో లేదోనని ఫ్యాన్స్ నిర్మాణ సంస్థకి లెటర్స్ మీద లెటర్స్ పంపిస్తూనే ఉన్నారట.

కానీ నిర్మాణ సంస్థ మాత్రం రాబర్ట్ ఆ పాత్ర చేయగలరని నమ్ముతున్నారు. ఈ క్రమంలో సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితేంటి..? అనే ప్రశ్న రాబర్ట్ కి ఎదురైంది. దీని ఆయన సినిమా ఫెయిల్ అయితే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లిపోతానని చెప్పారు. పోర్న్ అంటే అందరూ చేసే అసభ్యకరమైన పనులు కాదని.. ఆర్ట్ హౌస్ పోర్న్ వైపు వెళ్తానని చెప్పారు. సినిమా బాగా ఆడడం కోసం వీలైనంత కష్టపడి పని చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.