Asianet News TeluguAsianet News Telugu

అలా చేస్తే జనాలు మీ నెత్తికెక్కుతారు.. పోలీసులకు అర్జీవి రిక్వెస్ట్

జనాలను బయట తిరగనివ్వకుండా చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చెప్పినా కొందరికి చెవిన పడటం లేదు. ఇటీవల ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దండాలు పెడుతూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో అర్జీవి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

rgv special request to police for friendly police
Author
Hyderabad, First Published Mar 26, 2020, 1:00 PM IST

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఓ వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక జనాలను బయట తిరగనివ్వకుండా చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చెప్పినా కొందరికి చెవిన పడటం లేదు. ఇటీవల ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దండాలు పెడుతూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో అర్జీవి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

'జనాలకు దండాలు పెట్టి చెబితే అర్థం కాదు. పోలీసులకు నా విజ్ఞప్తి.. ఫ్రెండ్లి పోలీస్ అంటూ వ్యవహరించవద్దు. లేకుంటే పబ్లిక్ మీ నెత్తికెక్కుతారు' అంటూ అర్జీవి ఆగ్రహంతో చెప్పారు. ప్రస్తుతం అర్జీవి కరోనా వైరస్ పై ట్వీట్స్ మీద ట్వీట్ చేస్తున్నాడు. రీసెంట్ గా 'ఇంట్లో ఉంటే ఉగాది పచ్చడి ..బయటకు వెళితే ఓళ్ళంతా పచ్చడి..' అంటూ తనదైన శైలిలో కొటేషన్స్ వదిలాడు. అన్ని రకాల కరోనా జోక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మరోవైపు సెలబ్రిటీలు చాలా వరకు వారికి తోచినంత సాయాన్ని అందిస్తూ ప్రభుత్వాలకు అండగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున మొత్తంగా 2కోట్ల విరాళాన్ని అందించారు. నితిన్, త్రివిక్రమ్, వివి.వినాయక్ వంటి వారు పది లక్షలు ఇవ్వగా రామ్ చరణ్ 70లక్షల విరాళాన్ని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios