బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకుంది రష్మి గౌతమ్. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంటుంది. ఒకానొక సమయంలో డబ్బు కోసం బాగా ఇబ్బంది పడ్డ రష్మి.. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చిన్న చిన్న రోల్స్ లో కూడా నటించింది.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని మన తారలు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతుంటారు. రామ్ చరణ్ హోటల్ బిజినెస్, మహేష్ బాబు థియేటర్ బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతుంటే హీరోయిన్లు జిమ్ సెంటర్లు, నకల దుఖాణాలు పెడుతున్నారు.

హాట్ గర్ల్ గా మారిన తెలుగమ్మాయి.. అంజలి ఫోటోలు!

ఇప్పుడు రష్మి కూడా అదే రూట్ లో తన డబ్బుని భూములపై పెట్టిందని సమాచారం. ఒడిశాలో దాదాపు వంద ఎకరాల భూములు కొన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో రష్మి పుట్టారు. ఆమె చదువు మొత్తం వైజాగ్ లో జరిగింది.

ఇప్పుడు తన సొంతూరులో భూములు కొని అందులో పంటలు వేయబోతున్నట్లు తెలుస్తోంది. కోకో, యూకలిప్టస్ వంటి పంటలను పండించాలని రష్మి భావిస్తోంది. అయితే తన వ్యక్తిగత, వృత్తిపరంగా రూమర్స్ ఏమైనా వస్తే వెంటనే స్పందించే రష్మి.. ఈ వందల ఎకరాల భూములపై స్పందిస్తుందేమో చూడాలి!