ప్రముఖ సీనియర్ నటి రేఖ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె సీనియర్ నటుడు కమల్ హాసన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్, రేఖ జంటగా.. 1986లో 'పున్నగాయ్ మన్నన్' (తెలుగులో డాన్స్ మాస్టర్) అనే సినిమాలో నటించారు.

అందులో కమల్, రేఖ ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకుంటారు. సూసైడ్ సన్నివేశానికి ముందు కమల్ హాసన్.. రేఖకు ముద్దుపెట్టేశారట. ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అమ్మాయి ముఖం చూడను, అవే చూస్తా.. సుమకి షాకిచ్చిన రాఘవేంద్రరావు!

బాలచందర్ డైరెక్ట్ చేసిన 'పున్నగాయ్ మన్నన్' సినిమా షూటింగ్ లో సూసైడ్ సీన్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ ముద్దుపెట్టారని.. ఆయన కావాలని చేయలేదని.. కానీ ముద్దు సీన్ ఉందని తనకు దర్శకుడు బాలచందర్ కానీ కమల్ హాసన్ కానీ చెప్పలేదని అన్నారు.

తన అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టడంతో కోపం వచ్చిందని.. షూటింగ్ అయిన తరువాత బాలచందర్ గారి దగ్గరకి వెళ్లి ఇదే విషయం అడిగానని గుర్తు చేసుకున్నారు. దానికి ఆయన ముద్దు సీన్ లో తప్పేముంది..? ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందేనని చెప్పినట్లు తెలిపింది. అయితే ఆ సీన్ తరువాత తనకు చాలా రోజులు నిద్ర పట్టలేదని.. అదొక పీడకలలా తనను వెంటాడిందని రేఖ చెప్పుకొచ్చారు.