Asianet News TeluguAsianet News Telugu

ఏంటి రవితేజ ఇలా.. తెలిసే చేస్తున్నాడా?

ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. 

Ravi Tejas Krack  an unofficial remake of Sethupathi
Author
Hyderabad, First Published Feb 23, 2020, 5:41 PM IST

ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. ఒక టైమ్ లో రవితేజ సినిమా అంటే మినిమం ఓపెనింగ్స్ వచ్చేవి.  కానీ గత రెండేళ్లుగా రవితేజ సినిమాలకు అసలు ఓపినింగ్స్, కలెక్షన్లు రావడం లేదు. మొన్నొచ్చిన డిస్కో రాజా సినిమా కేవలం 7 కోట్ల 50 లక్షల మాత్రమే వసూలు చేసింది. వారం రోజుల్లోనే ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయిపోయింది.

ఇలాంటి పరిస్దితుల్లో .. ప్రస్తుతం రవితేజ తనకు గతంలో బలుపు, డాన్ శీను వంటి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తప్ప రవితేజ కెరీర్ నిలబడదు. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ సినిమా రవితేజ కు డు ఆర్ డై లాంటిది. ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఇలాంటి పరిస్దితుల్లో ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఒంగోల్ లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే..అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా..అంటూ తనదైన మ్యానరిజం తో రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.

అయితే ఈ టీజర్ చూసిన తర్వాత  ఈ చిత్రం తమిళనాట విజయం సాధించిన సేతుపతి సినిమాకు ఇది ఫ్రీమేక్ అని ప్రచారం మొదలైంది. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు కొడుకు గంట రవితేజ... హీరోగా జయంత్ సి పరాన్జీ ఈ సినిమాను జయదేవ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు దాంతో ఒక మంచి సబ్జెక్ట్ వేస్ట్ అయ్యిపోయింది.

రెచ్చిపోయిన ప్రియా వారియర్.. ఆన్ స్క్రీన్ లవర్ తో రొమాన్స్(ఫొటోస్)

దాంతో జనాలకు పెద్దగా తెలియని ఈ సినిమాని రిఫరెన్స్ గా పెట్టుకుని,  దర్శకుడు గోపీచంద్ మలినేని కొద్దిపాటి మార్పులతో క్రాక్ పేరుతో రీమేక్ చేస్తున్నాడని తెలుస్తోంది. రవితేజ ఇమేజ్ కు సరిపోయేలా కథను కాస్త మార్చి తీసుకొస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే ఫ్రీ మేకా, అఫీషియల్ రీమేకా అనేది ప్రక్కన పెడితే..సేతుపతి అదిరిపోయే యాక్షన్ మూవీ. రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే సినిమా అని అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే రవితేజకు ఈ విషయం తెలిసే ఓకే చేసాడా లేక సబ్జెక్టు బాగుందని ముందుకు వెళ్ళిపోతున్నాడా అనేది జనాలకు కలుగుతున్న ప్రశ్న.

Follow Us:
Download App:
  • android
  • ios