Asianet News TeluguAsianet News Telugu

రవితేజ పరిస్థితి మరీ ఇలా అయిపోయిందేంటి..?

రవితేజ ఎప్పుడూ తన బడ్జెట్,రెమ్యునేషన్ విషయాల్లో కాంప్రమైజ్ కావటం జరలేదు. కానీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని చేసిన డిస్కోరాజా...డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. 

Ravi Teja's next is in Very Low Budget?
Author
Hyderabad, First Published Jan 29, 2020, 4:24 PM IST

ఒక టైమ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా వెలుగు వెలిగారు రవితేజ. టైమ్ మారింది. కొత్త హీరోలు సీన్ లోకి వచ్చారు. కొత్త కాన్సెప్టులతో దర్శకులు హిట్స్ కొడుతున్నారు. కానీ మాస్ మానియాలో మాస్ మహరాజా మాత్రం ఊగిపోతూ ఒకే తరహా కథలు చేస్తూ వస్తున్నారు. వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్న రవితేజ...హిట్,ఫ్లాఫ్ లకు సంభంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. 

అలాగే రవితేజ ఎప్పుడూ తన బడ్జెట్,రెమ్యునేషన్ విషయాల్లో కాంప్రమైజ్ కావటం జరలేదు. కానీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని చేసిన డిస్కోరాజా...డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. మంచి ఓపినింగ్స్ రప్పించుకున్నా..రెండో రోజుకే చల్లబడిపోయింది. భారీ నష్టాలు ఈ సినిమాకు తప్పదని కొన్నవాళ్లకు, నిర్మించిన వాళ్లకు అర్దమైంది. ఈ విషయం రవితేజని ఆలోచనలో పడేసినట్లుంది. ఆ ప్రభావం ఇప్పుడు రవితేజ తాజా చిత్రంపై పడింది.

తగ్గిన డిస్కో రాజా కలెక్షన్స్.. మాస్ రాజా బ్యాడ్ లక్!

రమేష్ వర్మతో రీసెంట్ గా తన పుట్టిన రోజున సినిమా ప్రకటించిన రవితేజ..ఆ సినిమాని సాధ్యమైనంత లో బడ్జెట్ లో తీయమని చెప్పారట. రమేష్ వర్మ..రీసెంట్ గా రాక్షసుడు చిత్రం చేసారు. ఆ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చేసి మంచి లాభాలు ఆర్జించటంతో అదే స్ట్రాటజీ తన సినిమాకు ప్లే చేయమని చెప్పటం జరిగిందని సమాచారం. రవితేజ రెగ్యులర్ సినిమా బడ్జెట్ లో సగం కూడా లేకుండా ఈ సినిమా రూపొందబోతోందని వినికిడి.

నిర్మాతలు కూడా స్పెసిఫిక్ గా.. బడ్జెట్ విషయంలో ఆంక్షలు పెట్టి ఎట్టి పరిస్దితుల్లోనూ దాన్ని దాటటానికి వీల్లేదని చెప్పారట. రవితేజ కు ఇది బ్యాడ్ పీరియడ్ కావటంతో ఏమీ చెయ్యలేని పరిస్దితి. దాంతో ఈ సినిమాలో పెద్ద క్యారక్టర్ ఆర్టిస్ట్ లు కానీ, టెక్నీషియన్స్ కానీ ఉండబోరని సమాచారం. ఈ చిత్రం రవితేజ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్, గెటప్,ఊహించని కథతో తయారు కానుందిట. థ్రిల్లర్ కథాంశమని చెప్తున్నారు.
 
ఇక ఈ చిత్రం కథ గురించిన వార్తలు అప్పుడే మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ..ముఖ్యమంత్రి  పీఎ గా కనిపించబోతున్నాడట.  తనకున్న పరిచయాలు, ఇన్ఫూలయిన్స్ తో రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు,  అవినీతికి పాల్పడి ఎలా ఎదుగుతాడు. ఆ తర్వాత జీవితంలో ఓ పెద్ద దెబ్బ తగిలాక మంచిగా మారి ఏం చేస్తాడు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో కానీ, బడ్జెట్ విషయంలో మాత్రం కంట్రోలు మాత్రం తప్పదంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios