మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

గోపీచంద్ మలినేని టీజర్ తో సర్ ప్రైజ్ చేశాడు. రవితేజని పవర్ ఫుల్ గా చూపించడమే కాదు.. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో క్రైం అంశాలని కూడా కథలో ఇన్వాల్వ్ చేస్తున్నట్లు ఉన్నాయి. టీజర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేపే విధంగా ఉన్నాయి. 

సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ మరో స్థాయికి వెళ్ళింది. ఇక టీజర్ లో డైలాగ్స్ పైగా సినిమాపై ఆసక్తిని పెంచేవిధంగా ఉన్నాయి. 'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే' అంటూ సాగే డైలాగ్ ఈ చిత్రంలో క్రైమ్ అంశాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తోంది. 

టీజర్ లో కొన్ని షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక రవితేజ పోలీస్ గెటప్ లో అదరగొడుతున్నాడు. తనదైన శైలిలో జోవియల్ గా కనిపిస్తున్న రవితేజ రౌడీల పట్ల మాత్రం భయంకరంగా వ్యవహరించే పోలీస్ గా కనిపిస్తున్నాడు. టీజర్ లో ఒరేయ్ అప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా అంటూ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా క్రాక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. 

ఈ సమ్మర్ లో మే 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రవితేజ సరసన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.