సినిమా హిట్టవ్వాలంటే ప్రమోషన్స్ లో హీరోనే ముందుండాలి. ఎలాంటి సినిమా అయినా రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేస్తేనే హిట్టవుతుంది. కాంట్రవర్సీలతో బజ్ క్రియేట్ చేద్దామంటే అందరికి ఆర్జీవీ అంత డేర్ ఉండదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మాస్ రాజా రవితేజ కూడా తనదైన శైలిలో డిస్కోరాజా రేంజ్ పెంచే పెరిగే ప్రయత్నం చేశాడు.

అయితే అభిమానులను ఆకట్టుకోవడానికి అన్నాడో లేదో సినిమాపై అంత నమ్మకంగా ఉన్నాడో తెలియదు గాని సినిమాపై ఒకే ఒక్క మాటతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు. డిస్కో రాజా సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడిన మాటలు జనాలను ఆకట్టుకున్నాయి.  సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన రవితేజ నెక్స్ట్ సీక్వెల్ వచ్చే అవకాశం కూడా ఉందని అన్నాడు.

అంటే సినిమా హిట్టవ్వడం కాయమని చెప్పకనే చెప్పేశాడు. సినిమా షూటింగ్ ఎండ్ అయ్యే వరకు ప్రతి రోజు ఎంజాయ్ చేస్తూనే ఉన్నామని దర్శకుడు విఐ.ఆనంద్ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికి నచ్చుతుందని అన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెరిగిందనే చెప్పాలి. అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు నేటితో కాస్త శాంతిచే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని డిస్కోరాజా ఉపయోగించుకోగలిగితే మంచి ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది.