సాండల్‌ వుడ్‌ యంగ్ హీరో, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్‌ గౌడ వివాహం శుక్రవారం  ఘనంగా జరిగింది. ఈ వివాహంపై సీనియర్ నటి రవీనా టండన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవటం ఎంటీ అంటూ కౌంటర్‌ ఇచ్చింది ఈ బ్యూటీ. నిఖిల్ వివాహం బెంగళూరు సమీపంలోని రామనగర ఫాం హౌస్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎమ్‌ కృష్ణప్ప మేనకోడలు రేవతిని నిఖిల్ వివాహం చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 60 మంది ఈ వేడుకకు హాజరైనట్టుగా వెల్లడించారు. అయితే ఈ వేడుకలో ఎవరూ కూడా మాస్క్‌లు ధరించకపోవటం, సోషల్ డిస్టాన్స్‌ మెయిన్‌టైన్‌ చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. లాక్‌ డౌన్‌ నింబంధనలు పాటించకపోయి ఉంటే చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి అశ్వంత్‌ నారాయణ్ హెచ్చరించారు.

ఈ పెళ్లిపై స్పదించిన రవీనా.. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజలు సంక్షోభంలో ఉన్నారు. తమ కుటుంబ సభ్యులను కూడా చేరలేకపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. మరోపక్క కొందరు తమ శక్తి మేరకు పేదలకు సాయం అంధిస్తున్నారు. కానీ డబ్బున్న వారు మాత్రం ఈ నిబందనలేవీ పట్టించుకోవటం లేదని సామాన్యుల కష్టాలు వారికి పట్టండం లేదు. పెళ్లి విందులో ఏం వడ్డించారో..` అంటూ ఆమె పరోక్షంగా విమర్శించారు.