గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ జెర్సీ. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ కి మరీంత బూస్ట్ ఇచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఆ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మించారు. అయితే సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ సినిమా ఇతర ఇండస్ట్రీల వారిని ఆకర్షించింది.

ఇక సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో కథానాయిక పాత్రకు సౌత్ బ్యూటీ రష్మిక మందన్నను అందుకున్నట్లు టాక్ వచ్చింది. హిందీలో దర్శకుడు గౌతమ్ షాహిద్ కపూర్ తో మరొక జెర్సీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ - దిల్ రాజు కలిసి బాలీవుడ్ నిర్మాతతో జెర్సీ ని రీమేక్ ని స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా రష్మిక అయితే బావుంటుదని అనుకున్నారు. కానీ అందుకు మేడమ్ ఒప్పుకోకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

రెమ్యునరేషన్ ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వనందుకే సినిమా చేయడానికి ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. అలాగే ఆ పాత్ర కూడా ఆమెకు నచ్చలేదని రూమర్స్ వినిపించాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని రష్మిక కొట్టి పారేసింది. సౌత్ సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉండడం వల్ల  డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదని అందువల్లే ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక నెక్స్ట్ బన్నీతో కూడా ఒక సినిమా (సుకుమార్ ప్రాజెక్ట్) చేయనునున్నట్లు చెప్పింది.