కేవలం సినిమా వాళ్లకే కాదు....తెలుగు వాళ్లందరికీ తెలిసిన పేరు..రామా నాయుడు స్టూడియో. ఎన్నో వందల సినిమాలు ఇక్కడ నిర్మాణం అయ్యాయి. మూవీ మొఘల్ రామానాయుడు ఈ స్టూడియోని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నిర్మించారు. తాను సైతం దాదాపు అన్ని భాషల్లోనూ నిర్మాణం చేసారు. దేశవ్యాప్తంగా ఈ స్టూడియోకు మంచి పేరు ఉంది. అలాంటి స్టూడియో ఇక కనమరుగు కాబోతోందా అంటే అవుననే వినపడుతోంది.  ఈ స్టూడియోని ఓ కనస్ట్రక్షన్ కంపెనీకు అమ్మేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రామానాయుడు వారసుడు అయిన సురేష్ బాబు...పక్కా బిజినెస్ మ్యాన్. సినిమాని కళ కన్నా బిజినెస్ లాగ చూసే ఆయన హయాంలో సిని నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. అంతకు ముందు యాక్షన్ ..కట్ లతో హడావిడిగా ఉండే రామానాయుడు స్టూడియోస్ ఎప్పుడో కానీ బిజీగా ఉండటం లేదు. ముఖ్యంగా రామోజి ఫిల్మ్ సిటీ వచ్చాక...మిగతా లోకల్ స్టూడియోస్ కు పని తగ్గింది.

మెగా ప్రొడ్యూసర్ తో మహేష్ మూవీ?

అందులోనూ సురేష్ బాబుతో మాట్లాడి...ఆయన చెప్పే రేట్లకు ఆ స్టూడియోను వినియోగించుకోవటం కష్టమని నిర్మాతల భావన. దాంతో బయిటనుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసే నిర్మాతలు తగ్గారు. సొంత నిర్మాణం లేక, బయిట నిర్మాతల సినిమాలు లేక స్టూడియో వెలా తెలా పోతోంది. స్టూడియో మెయింటినెన్స్, స్టాఫ్ ఇవన్నీ ...ఖాళీగా స్టూడియోని పెట్టి ఖర్చు పెట్టడం దండుగ అని సురేష్ బాబు భావించారట. ఈ క్రమంలో ఆయన మీనాక్షి కనస్ట్రక్షన్ వారికి ఈ స్టూడియోని అమ్మేసినట్లు సమాచారం.  

అతి త్వరలో  ఈ స్టూడియో ని ప్లాట్స్‌ గా తయారు చేసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై అతి త్వరలోనే  అధికారిక ప్రకటన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ స్టూడియోలో బెల్లంకొండ సురేష్ కుమారుడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.