రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. ఎప్పుడు ఎలాంటి చిత్రంతో వివాదాలు సృష్టిస్తాడో ఎవరికీ తెలియదు. ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా కాంట్రవర్షియల్ సబ్జెక్టులనే ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. వర్మ తెరకెక్కించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. 

ఆ చిత్రం ఎట్టకేలకు గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ మరో చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' పేరుతో ఓ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇండో చైనీస్ సంస్థలు భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బ్రూస్ లీని ఆరాధిస్తూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే ఓ యువత కథని వర్మ తనదైన శైలిలో గ్లామర్, రొమాన్స్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ఏ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

పూజాని వర్మ యాక్షన్ ఎపిసోడ్స్ లో పవర్ ఫుల్ గా చూపిస్తూనే.. హాట్ హాట్ గ్లామర్ షో కూడా చేయిస్తున్నాడు. హీరోయిన్ కు ఆమె ప్రియుడితో రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రవిశంకర్ సంగీతం అందిస్తున్నాడు.