సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు శివ చిత్రంతో సంచలనం సృష్టించిన వర్మ.. ప్రస్తుతం వివాదాలు సృష్టించేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. వర్మ ఎంచుకుంటున్న కథలు అలాగే ఉన్నాయి. వివాదభరిత కథలు ఎంచుకోవడం.. దాని చుట్టూ కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ తర్వాత పబ్లిసిటీ పొందుతున్నాడు. 

లక్ష్మీస్, ఎన్టీఆర్, వంగవీటి  లాంటి పొలిటికల్ కథలతోనే కాదు.. జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) లాంటి అడల్ట్ కంటెంట్ చిత్రాలతో సైతం వివాదాలు సృష్టించడం వర్మకు అలవాటే. 

జీఎస్టీ చిత్రంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించింది. ఆ చిత్రంపై పలు విమర్శలు వినిపించాయి. తాజాగా మియా మాల్కోవాతోనే వర్మ మరో చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం పేరు క్లైమాక్స్. ఈ చిత్రంలో మియా మాల్కోవా ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

పోర్న్ స్టార్ అంటే ఇక చెప్పేదేముంది.. అందాల ఆరబోతలో, శృంగార సన్నివేశాల్లో ఆమెకు ఎలాంటి హద్దులు ఉండవు. తాజాగా క్లైమాక్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో మియా మాల్కోవా నగ్నంగా కనిపిస్తూ హీటెక్కిస్తోంది. ట్రైలర్ లో విశేషాలని గమనిస్తే.. మియా మాల్కోవా తన ప్రియుడితో కలసి ఓ డెంజరస్ ఎడారిలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ వారిద్దరూ శృంగారంలో మునిగితేలుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఊహించని విధంగా వీరిద్దరూ చిక్కుల్లో పడతారు. ఎవరో కొందరు వీరిపై అటాక్ చేస్తారు. 

ఈ క్రమంలో ఆమె ప్రియుడు మరణిస్తాడు. దీనితో ఒంటరిగా మారిన మియా మాల్కోవా నగ్నంగా ఎడారిలో తిరుగుతూ పోరాడుతూ ఉంటుంది. అసలు ఆ ఎడారిలో ఏముంది.. మియా మాల్కోవాపై అటాక్ చేస్తున్నది ఎవరు అనేది తెలియాలంటే క్లైమాక్స్ సినిమా చూడాల్సిందే.