హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ లాంటి స్టార్స్ అందరితో రకుల్ ఆడి పాడింది. 

కానీ ఇటీవల కొంత కాలంగా రకుల్ కు సరైన సక్సెస్ లేదు. రకుల్ నటించిన జయ జానకి నాయక, స్పైడర్, మన్మథుడు 2 చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. దీనితో టాలీవుడ్ దర్శక నిర్మాతలు రకుల్ ని పక్కన పెడుతూ వచ్చారు. ఇక టాలీవుడ్ లో రకుల్ కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. 

బుల్లితెర భామ బోల్డ్ అందాలు.. బికినీలో సెగలు రేపుతోంది

తాజాగా రకుల్ కెరీర్ తిరిగి పుంజుకోబోతున్నట్లు తెలుస్తోంది. భీష్మ చిత్రంతో హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉన్న నితిన్ సరసన రకుల్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ని సంప్రదిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ రకుల్ నే ఫైనల్ చేసినట్లు టాక్. 

ఇక బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఛాన్స్ దక్కించుకుంది. స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసర రకుల్ మరోమారు రొమాన్స్ పండించబోతోంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న థ్యాంక్ గాడ్ అనే చిత్రంలో రకుల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట. ప్రస్తుతం సరైన అవకాశాలు లేక రకుల్ కెరీర్ డల్ గా మారింది. ఈ రెండు చిత్రాలపై రకుల్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉందట.