సినీ నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీరైడ్డి తన ఫేస్ బుక్ పేజీలో నటి కరాటే కళ్యాణి. కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ లపై శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖలతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. 

అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ శ్రీరెడ్డి సుదీర్ఘమైన వీడియో పోస్ట్ చేసింది. తాను సైలెంట్ గా ఉన్నప్పటికీ కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లాంటి వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని శ్రీరెడ్డి వీడియో పోస్ట్ చేసింది. వారిద్దరిపై దుమ్మెత్తి పోసింది. 

శ్రీరెడ్డి అసభ్యకరమైన వ్యాఖలని నిరసిస్తూ కరాటే కళ్యాణి ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు చేశారు. తాజాగా రాకేష్ మాస్టర్ కూడా శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. అనంతరం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన చేపట్టిన తర్వాత ఆమెతో ఫోన్ లో మాట్లాడా. ఆమె పోరాటానికి మద్దతు తెలిపా. మా అసోసియేషన్ లో శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం గురించి గళం విప్పుతానని హామీ ఇచ్చా. శ్రీరెడ్డి నన్ను రాకేష్ గారు అని పిలిచేది. నీకు తండ్రి లాంటివాడని.. బాబాయ్ అని పిలువు అని చెప్పా. 

చిరంజీవితో అనుబంధం.. నితిన్ అత్తామామల గురించి ఆసక్తికర విషయాలు !

కొన్ని రోజుల తర్వాత శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడడం మానేశానని రాకేష్ మాస్టర్ అన్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా ఆమెతో ఉన్న పరిచయం, ఇతర విషయాల గురించి మాట్లాడా. దానిని శ్రీరెడ్డి తప్పుగా అర్థం చేసుకుంది. 

దిల్ రాజుకు బిగ్ షాక్.. 'ఎస్వీసి' నుంచి అతడు అవుట్!

బూతులతో అసభ్యంగా విమర్శించింది. అందువల్లే కేసు నమోదు చేసినట్లు రాకేష్ మాస్టర్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.