దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఒక దృశ్య కావ్యం. రాజమౌళి తన విజన్ తో బాహుబలి చిత్రం ద్వారా సినీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాడు. దాదాపు 5 ఏళ్ల పాటు బాహుబలి రెండు భాగాల కోసం రాజమౌళి, బాహుబలి చిత్ర యూనిట్ శ్రమించింది. 

ముఖ్యంగా బాహుబలి మొదటి భాగంలో అయితే రాజమౌళి కాలకేయులకు కిలికి అనే భాషని కూడా కనిపెట్టాడు. కాలకేయులు మాట్లాడే భాష ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అలాంటి భాష నిజంగానే ఉంది. డాక్టర్ మదన్ కార్కే 2013 నుంచి కిలికి భాషపై పరిశోధన చేస్తున్నారు. 

రెడ్ లిప్స్ తో హాట్ కిస్.. మరోసారి పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్ వీడియో!

కిలికి భాష కోసం ఆయన 22 అక్షరాలని కూడా రూపొందించారు. ఓ వెబ్ సైట్ ని రూపొందించి అందులో కిలికి భాష అక్షరాలని ఉంచారు. ఈ వెబ్ సైట్ ని దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేశారు. www.kiliki.in లింక్ ద్వారా కిలికి వెబ్ సైట్ లోకి లాగిన్ కావచ్చు. 

ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

సినిమాల విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిని మించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రం కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.