మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా రంగ ప్రవేశం చేశాడు. చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. 

చరణ్ మరోసారి రాజమౌళి దర్శత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో లో నటిస్తున్నాడు.  ఇంటర్వ్యూలో రాజమౌళి రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీర సమయంలో రామ్ చరణ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్న నటుడు. కానీ ప్రస్తుతం చరణ్ లో పరిణితి చాలా పెరిగింది. దర్శకుడికి ఎలా అవసరం అయితే అలా చరణ్ నటించగలడు అని రాజమౌళి ప్రశంసించారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో అలియా భట్ చరణ్ కి జోడిగా నటించనుంది. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.