స్టూడెంట్ నంబర్‌ 1 సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ గురించి మాట్లాడిన రాజమౌళి..  ఆ సమయంలో ఎన్టీఆర్‌ లావుగా ఉండేవాడు. హెయిర్‌ స్టైల్‌ కూడా అంత బాగుండేది కాదు. పర్సనల్ గ్రూమింగ్ గురించి అప్పట్లో ఎన్టీఆర్‌కు తెలియదు. నా తొలి సినిమా హీరో ఓ రేంజ్‌లో ఉండాలి అనుకున్నా కానీ ఇలాంటి  హీరో వచ్చాడేంటి అని ఎన్టీఆర్‌ ను చూసి ఇబ్బంది గా ఫీల్‌ అయ్యా అని చెప్పాడు.

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆర్ఆర్ఆర్‌లోనూ ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే చాలా కాలం తరువాత రాజమౌళి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ తో పాటు కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు.

ఈ సందర్భంగా తన తొలి సినిమా గురించి మాట్లాడిన రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టూడెంట్ నంబర్‌ 1 సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ గురించి మాట్లాడిన రాజమౌళి.. ` ఆ సమయంలో ఎన్టీఆర్‌ లావుగా ఉండేవాడు. హెయిర్‌ స్టైల్‌ కూడా అంత బాగుండేది కాదు. పర్సనల్ గ్రూమింగ్ గురించి అప్పట్లో ఎన్టీఆర్‌కు తెలియదు. ఫస్ట్ సినిమా కాబట్టినాకు కూడా పెద్దగా తెలియదు. కానీ నా తొలి సినిమా హీరో ఓ రేంజ్‌లో ఉండాలి అనుకున్నా కానీ ఇలాంటి హీరో వచ్చాడేంటి అని ఎన్టీఆర్‌ ను చూసి ఇబ్బంది గా ఫీల్‌ అయ్యా` అని చెప్పాడు రాజమౌళి.

అయితే ఎన్టీఆర్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ తరువాత ఎన్టీఆర్ మీద తన ఓపీనియన్‌ పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఎన్టీఆర్ గొప్ప నటుడవుతాడని నాకు అర్థమైంది. ఆ తరువాత మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది అని చెప్పాడు రాజమౌళి.