Asianet News TeluguAsianet News Telugu

పవన్ ‘పింక్‌’ రీమేక్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

అందుతున్న సమాచారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మార్చి 2 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయిన మార్చి 8 న విడుదల చేస్తారు. 

Pink Remake First look on 2nd, the song on 8th March
Author
Hyderabad, First Published Feb 29, 2020, 12:50 PM IST

హిందీలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చన్ కీ రోల్ లో న‌టించగా సెన్సేషన్ హిట్ అయిన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రాన్ని ఇప్పటికే  త‌మిళంలో అజిత్ హీరోగా బోనీ క‌పూర్ తెర‌కెక్కించారు. నేర్కొండ‌పార్వై` పేరుతో `ఖాకీ` ఫేమ్ హెచ్‌. వినోద్‌ రూపొందించిన ఈ చిత్రం అక్క‌డ కూడా మంచి విజయం సాధించింది. తాజాగా ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 

బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్‌రాజు  శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో  షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పవన్ ఎలా కనపడబోతున్నారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. దాంతో చిత్రం ఫస్ట్ లుక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

అందుతున్న సమాచారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మార్చి 2 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయిన మార్చి 8 న విడుదల చేస్తారు. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక టైటిల్ విషయానికి వస్తే లాయిర్ సాబ్ కానీ, వకీల్ సాబ్ ని పెట్టనున్నారు. వకీల్ సాబ్ అనే టైటిల్ మాస్ కు బాగా కనెక్టు అవుతుందని సమాచారం. అలాగే సినిమాని మే 15 న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ప‌వ‌న్ ఇమేజ్‌కి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేసి, వినిపించిన చిత్రం టీమ్ సినిమాకు కీల‌క‌మైన కోర్టు సెట్‌ని భారీగా నిర్మించారు. ఇందు కోసం కోర్టు సెట్‌ని అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలో రెడీ చేసి షూట్ చేస్తున్నారురు.   కోర్టు హాలు లోనే అత్య‌ధిక శాతం షూటింగ్ వుంటుంది కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగా సెట్‌ని ఏర్పాటు చేసారు.

ఈ నెల 20వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అదే సమయంలో  ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు.  పవన్ ఈ సినిమా ద్వారా మహిళలకు రక్షణ, దిశ చట్టం, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మహిళా అత్యాచారాలపై మాట్లాడాలనే ఆలోచనతోనే అంటున్నారు.

సినిమా అనేది పవర్ ఫుల్ మాధ్యమం కావటంతో మహిళా సమస్యల గురించి చర్చించటానికి ఇదే సరైన వేదిక అని ఆయన భావించారట. అంతేకాదు పనిలో పనిగా కొన్ని పొలిటికల్ సెటైర్స్ కూడా ఉండబోతున్నాయట. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి హిట్ అయిన  చిత్రం ‘పింక్‌’. మహిళల రక్షణ చుట్టూ సాగే ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios