జూనియర్ న్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అరవింద సమేత అనంతరం రెండేళ్ల పాటు వెండి తెరకు దూరమవుతున్న తారక్ నెక్స్ట్ ఇయర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మల్టి స్టారర్ సినిమా అయిపోగానే నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు.

రీసెంట్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అల.. వైకుంఠపురములో సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు అదే తరహాలో తారక్ తో కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ కి జతగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసింది. త్రివిక్రమ్ సినిమాను కళ్యాణ్ రామ్ చినబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.  ఎన్టీఆర్ సలహా మేరకు కళ్యాణ్ రామ్ తో సినిమాని నిర్మించేందుకు త్రివిక్రమ్, చినబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మొదట్లో ఒంటరిగానే ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ తారక్ సింగిల్ సిట్టింగ్ లో సెటిల్మెంట్ చేసినట్లు టాక్. ఎందుకంటె గతకొంత కాలంగా కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు.  వరుసగా నష్టాలు రావడంతో అన్నయ్యను పట్టుబట్టి త్రివిక్రమ్ గ్యాంగ్ లో ఇరికించినట్లు సమాచారం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఇక RRR వల్ల నెంబర్స్ డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2021 సమ్మర్ లో రానున్న ఆ ప్రాజెక్టు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.