ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.సీనియర్ నటీమణి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై అనేక వార్తలు, రూమర్స్ వస్తున్నాయి.

దాంతో ఏది వార్తో, ఏది రూమరో తెలియని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.  ప్రస్తుతం  ఈ చిత్రంలో  స్పెషల్ ఎట్రాక్షన్  కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ఎట్రాక్షన్ ఏమిటీ అంటే...ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కనిపించబోతోందట. అయితే ఇది కేవరం రూమరే అని ఇందులో కొంతకూడా నిజం లేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ హోస్ట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో!

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఐటం లేదా స్పెషల్ సాంగ్స్ పెట్టే సిట్యువేషన్ లేదట. ఈ సినిమాని దూకుడు టైప్ లో ఊహించుకుని మీడియాలో స్పెషల్ సాంగ్ ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ తో డాన్స్ చేయిస్తే బాగుంటుందని దర్శక,నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.

గతంలో తమన్నా కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అవన్నీ హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాలో కూడా ఈ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తమన్నానే అడుగే అవకాసం ఉందంటున్నారు. అంతేతప్ప ఐటం సాంగ్ లు,స్పెషల్ సాంగ్స్ కు ఈ సినిమాలో అంత సీన్ లేదంటున్నారు.

ఈ చిత్రం పూర్తి స్దాయి ఫన్ తో రూపొందుతోందని ఇప్పటికే వినపడుతోంది. అయితే చిత్రం బ్యాక్ డ్రాప్ మిలిట్రీ లో కొంత, ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో మరికొంత కథ జరుగుతుందని వినికిడి.   అందుకే మొదట్లో  ఈ సినిమాకు రెడ్డిగారి అబ్బాయి అని టైటిల్ అనుకున్నారట. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ కి గుర్తుగా చెప్పుకొనే కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ  వార్తలకు బలం చేకూరుతోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.