టాలీవుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి స్పెషల్ గెస్ట్ లను పిలుస్తూంటారు. కొందరు మాత్రం గెస్ట్ లను తీసుకురాకుండా కేవలం చిత్రబృందంతో ఈవెంట్ పూర్తి చేస్తారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇదే టైప్.

వీలైనంత వరకు సినిమాతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారు మాత్రమే ఉండేలా తమ సినిమాల ఫంక్షన్స్ ప్లాన్ చేస్తారు. 'అల.. వైకుంఠపురములో' సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు. కానీ అదే ఇప్పుడు సినిమాపై క్రేజ్ ని దెబ్బ కొడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ని పిలిచి బన్నీ టీం ని డిఫెన్స్ లో పడేశారు.

ఉంటానికి ఇల్లు లేదు కానీ.. కాస్ట్లీ కారు కావాలా? రాహుల్ సింప్లిగంజ్ పై ట్రోల్స్!

మరెవరినీ గెస్ట్ గా పిలవలేని పరిస్థితి. ఎవరినైనా పిలవాలంటే మెగాస్టార్ కి ధీటుగాఉండాలి. అలా అంటే పవర్ స్టార్ లాంటి వాళ్లను తీసుకురావాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది అంత సులభమైన విషయం కాదు. అందుకే 'అల.. వైకుంఠపురములో' చిత్రబృందం ఎవరినీ పిలవకుండా యూనిట్ వరకే పరిమితం కావాలని నిర్ణయించుకుంది.

ఇలాంటి నేపధ్యంలో మెగాస్టార్ తో ఫంక్షన్ చేసి, మహేష్ టీమ్ మార్కులు కొట్టేసింది. ఒకరోజు తేడాతో ఫంక్షన్లు ఉండడంతో మెగాఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అన్ని ప్రాంతాల నుండి ఓరోజు ముందు వచ్చేసి.. మహేష్ ఫంక్షన్ కి కూడా వెళ్లారు. దానికి కారణం అక్కడ మెగాస్టార్ ఉండడమే..

అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ కలిసి 'సరిలేరు నీకెవ్వరు' ఈవెంట్ ని హిట్ చేశారు. సాధారణంగా అయితే గీతాఆర్ట్స్ సంస్థ ప్లానింగ్ సెపరేట్ గా ఉంటుంది. కానీ ఈసారి త్రివిక్రమ్ మాట మీద ఆధారపడి ఉండడంతో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోయారు.