యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని నితిన్, రష్మిక షురూ చేశారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. 

ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రష్మిక గ్లామర్, నితిన్ కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో నితిన్, రష్మిక భీష్మ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

రష్మిక గురించి నితిన్ లీక్ చేసిన ఓ విషయం అందరికి ఆశ్చర్యంతో పాటు, నవ్వులు తెప్పిస్తోంది. ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. మనం ఆకలేస్తే స్నాక్స్ రూపంలో సమోసా, బిస్కెట్స్, చిప్స్ లాంటివి తింటాం.. కానీ రష్మిక ఆకలేస్తే ఏం తింటుందో తెలుసా.. కుక్క బిస్కెట్స్ తింటుంది అని చెప్పాడు. నితిన్ ఈ విషయం సరదాకి చెప్పలేదు. 

అక్కాచెల్లిళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన చిరుత పిల్ల

రష్మిక నిజంగానే భీష్మ సెట్స్ లో కుక్క బిస్కెట్స్ తినిందట. రష్మిక తాను పెంచుకునే కుక్కకు బిస్కెట్స్ పెడుతుంది. ఆ కుక్క బిస్కెట్స్ నే రష్మిక తినిందట. పక్కనే ఉన్న రష్మిక నితిన్ ని తిడుతూనే వివరణ ఇచ్చింది. సాధారణంగా నాకు క్యూరియాసిటీ ఎక్కువ. మనం తినే బిస్కెట్స్ ఎలా ఉంటాయో తెలుసు.. కుక్క బిస్కట్ల టేస్ట్ ఎలా ఉంటుంది.. తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అందుకే కొంచెం కుక్క బిస్కెట్స్ తిన్నట్లు చెప్పుకొచ్చింది. కుక్క బిస్కెట్స్ కూడా బాగానే ఉన్నాయని రష్మిక తెలిపింది.