'ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చింది' అనే సామెత గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్ కారణంగా చాలా మంది యువహీరోలు ఇళ్ళల్లో గోల మొదలైంది. నితిన్ ఇటీవల తన ప్రేయసిని పరిచయం చేస్తూ పసుపు కుంకుమ ఈవెంట్ తో పెళ్లి కొడుకుగా దర్శనం ఇచ్చాడు. త్వరలో దుబాయ్ లో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే నితిన్ పెళ్లి వార్తలు చాలా మంది స్టార్ హీరోల ఇళ్లను కదిలించాయి.

మూడు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచ్ లర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న యువ హీరోలు ఇప్పుడు పేరెంట్స్ నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ నితిన్ కు ఫోన్ చేసి విషెస్ చెబుతూనే.. తన బాధను కూడా చెప్పుకున్నాడట.  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఈ విషయాన్నీ చెప్పాడు. గతంలో వరుణ్ పెళ్లి పై ఒక కామెంట్ చేశాడు.

'ఇప్పుడే మేము పెళ్లి చేసుకోలేము. మాకు ప్రేరణగా నితిన్, ప్రభాస్, రానా లాంటి వాళ్ళు ఉన్నారు. వారే మాకు ఆదర్శమని చెప్పాడు'. అయితే ఇప్పుడు నితిన్ పెళ్లికి రెడీ అవ్వడంతో పెళ్లి చేసుకొమ్మని ఇంట్లో గోల చేస్తున్నారని నితిన్ కి ఫోన్ చేసి చెప్పాడు వరుణ్.. ఒక్క వరుణ్ ఇంట్లోనే కాదు. ప్రభాస్ - రానా - శర్వానంద్ - సాయి ధరమ్ తేజ్. రామ్ పోతినేని ఇళ్లల్లో కూడా పెళ్లి గోలతో హీరోలు సతమతమవుతున్నారట.

వీరంతా 30 ఏళ్ళు దాటిన వారే కావడంతో.. ప్రభాస్ లా మారిపోతారేమో అని భయంతో ఫ్యామిలీ మెంబర్స్ వారి హీరోలకు పెళ్లి చేయాలనీ రెడీగా ఉన్నారు. కానీ హీరోలు ఎప్పటికప్పుడు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇంతలో నితిన్ - నిఖిల్ లాంటి వారు పెళ్లి బట్టలతో దర్శనమిస్తుండడంతో మిగతా హీరోలు టెన్షన్ పడుతున్నారు. మరీ నెక్స్ట్ ఎవరి వికెట్ పడుతుందో చూడాలి.