ఐటెం సాంగ్స్ తో గుర్తింపు పొందిన బోల్డ్ బ్యూటీ రాఖి సావంత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. హాట్ కామెంట్స్ తో రాఖీ సావంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే రాఖి సావంత్ తాజాగా నెటిజన్ల చేతిలో విమర్శలు ఎదుర్కొంటోంది. 

అందుకు కారణం రాఖి సావంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పిక్. రాఖి సావంత్ పెళ్లి చేసుకుంటున్నట్లు ఉన్న ఆ పిక్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో వైరల్ గా మారింది. రాఖి సావంత్ సాంప్రదాయ వస్త్రధారణలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఉన్న ఆ పిక్ పై ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

కరోనా క్రైసిస్: 'దూకుడు' నటుడు రెచ్చగొట్టే కామెంట్స్.. అరెస్ట్

రాఖి సావంత్ తాను గత ఏడాది ఓ ఎన్నారై ని వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిక్ లో వరుడు కనిపించకపోవడంతో నెటిజన్లు 'మిస్టరీ హస్బెండ్ అని కామెంట్స్ చేస్తున్నారు. రాఖి సావంత్.. మీకు ఇది ఎన్నో పెళ్లి, మీరు పక్కన ఎవరూ లేరు.. మిమ్మల్ని మీరే పెళ్లి చేసుకుంటున్నారా అని ఆమెపై సెటైర్లు సంధిస్తున్నారు. 

రాఖీ సావంత్ పలు ఐటెం సాంగ్స్ తో పాటు, బుల్లి తెరపై బిగ్ బాస్ షో లో కూడా పాల్గొంది. పలు టివి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Apr 16, 2020 at 9:10am PDT