నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాయి. ఈ చిత్రానికి 'V' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో నాని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 

డెబ్యూ దర్శకులు అయినప్పటికీ మంచి కథతో వస్తే అవకాశం ఇవ్వాలని నాని భావిస్తున్నాడు. నాని నటించిన చివరి చిత్రం గ్యాంగ్ లీడర్ కూడా నిరాశపరిచింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. 

నాని తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని వరుసగా యువ దర్శకులు వినిపించే కథలు వింటున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ అనే డెబ్యూ దర్శకుడు చెప్పిన కథ నానిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్, మహేష్ బాక్సాఫీస్ వార్.. మధ్యలో మెగాస్టార్!

దీనితో నాని అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. సుకుమార్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన చిత్రానికి కూడా సుకుమార్ వద్ద పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడు. అన్ని V మూవీ తర్వాత నాని నటించబోతున్న చిత్రం ఇదే కావచ్చు.