నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో. నానితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ హిట్. మీడియం బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించి అత్యధిక లాభాలు పొందవచ్చు. అంధులు నాని నుంచి ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలు వస్తుంటాయి. 

ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు 'V' చిత్రం మార్చ్ లో రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఇక నాని ఈ ఏడాది మూడవ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. నాని  27వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. 

నానితో జెర్సీ లాంటి క్లాసిక్ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ మరోసారి నేచురల్ స్టార్ తో సినిమా నిర్మించనుంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటిస్తూ నాని 27వ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ వీడియో రేపు(ఫిబ్రవరి 24) సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.నాని బర్త్ డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. 

రెచ్చిపోయిన ప్రియా వారియర్.. ఆన్ స్క్రీన్ లవర్ తో రొమాన్స్(ఫొటోస్) 

దీనితో ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం.. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శత్వంలో నాని 27 వ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే రేపటి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. నాని, సితార ఎంటర్టైన్మెంట్ కాంబోలో వచ్చిన జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.