తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఒకరు. గతంలో ఆయన తెరకెక్కిన సినిమాలు హిట్ టాక్ ని దక్కించుకున్నారు. 'అష్టా చమ్మా' సినిమాతో హీరో నానిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే.

వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్‌మన్' కూడా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి 'వి' సినిమా కోసం పని చేస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 'ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు.. అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తూంటాడు అంతే..' అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

'న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడానికి నువ్వొస్తున్నావని అనగానే విజిల్స్ వేయడానికి నేనేమీ నీ ఫ్యాన్ ని కాదు..' అంటూ నాని వేసే పంచ్ హైలైట్ గా నిలిచింది. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా.. నాని మర్డర్లు చేసే సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నారు. 'ఉగాది' పండుగ సందర్భంగా మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.