నాని అభిమానులకు ఈ రోజు సాయింత్రం సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నా సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నాని  పుట్టిన రోజు సందర్భంగా ఓ గిప్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ప్రకటన సైతం వచ్చింది. దాంతో  ఆ సర్‌ప్రైజ్‌ ఏమిటి? అనేది హాట్ టాపిక్ గా మారింది.  అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న నాని మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. నానికి ఇది 27వ సినిమా.

కామెడీ నుంచి విలనిజం దాకా నేను బిగ్ బాస్ అంటున్న నేచురల్ స్టార్

ఈ చిత్ర టైటిల్‌ను ఈ రోజు ప్రకటించనుంది చిత్రం టీమ్. ఎప్పటి నుంచో ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ నానితో ఓ చిత్రం చేస్తాడని వార్తలొస్తున్నాయి. అది నిజం కాబోతోందని తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌తో ‘నాని 27’ని తెరకెక్కించేది రాహుల్‌ అనే అంటున్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న  ట‌క్ జ‌గ‌దీష్ త‌ర్వాత ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. నాని...ఈ స్టోరీ లైన్ విన్న వెంటనే ఎక్సైట్ అయ్యి...ప్రాజెక్టు సైన్ చేసాడని చెప్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి `శ్యామ్ సింగ రాయ్‌` అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు సమాచారం. ఈ పేరే విభిన్నంగా ఉందంటే, ఇక సినిమా ఎలా ఉంటుందో ఎక్సపెక్ట్ చేయవచ్చు. ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మ‌ని, నాని స్టైల్ ఫ‌న్‌తో పాటు… మాస్ అంశాలు కూడా ఉంటాయ‌ని స‌మాచారం. ఈ విషయం రివీల్ చేయటానికి కాన్సెప్ట్‌ వీడియోను సిద్ధం చేశారు. మరి అవునా, కాదా? అన్న విషయం తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.