Asianet News TeluguAsianet News Telugu

మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా మేనల్లుడు

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు  ఏర్పడ్డాయి. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ ప్రొడక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ ని అనుకుంటున్నారు.

megahero vaishnav tej second project update
Author
Hyderabad, First Published Dec 9, 2019, 9:06 AM IST

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో కుర్ర హీరో వైష్ణవ్ తేజ్. ఈ హీరో మొదటి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు  ఏర్పడ్డాయి. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ ప్రొడక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ ని అనుకుంటున్నారు.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కూడా సుకుమార్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఉప్పెన ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది - ఓ బేబీ వంటి హిట్ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడట. మెగాస్టార్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది 

ఉప్పెన సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇకపోతే నందిని రెడ్డి డైరెక్షన్ లో చేయబోయే సినిమాను నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరపైకి  తేనుంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.

also read: సుకుమార్, మెగా హీరో సినిమా నుంచి అతడు తప్పుకున్నాడా!

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న డెబ్యూ మూవీ 'ఉప్పెన'. ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

విభిన్నమైన కథతో తెరక్కుతున్న ఈ చిత్రంపై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతవరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనక పోవడంతో వేగంగా ఈ రూమర్లు వ్యాపించాయి. 

విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదట. అందుతున్న సమాచారం మేరకు విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనే షెడ్యూల్ ఆగష్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో జాలరి పాత్రలో నటిస్తున్నాడు. ఉప్పెన చిత్రం పై నెలకొన్న గందరగోళం తొలగాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios