మీరా మిథున్ మోడల్ గా చెన్నైలో రాణిస్తోంది. మీరా మిథున్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి, కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. ఇక కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో మీరా మిథున్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది.

35 రోజుల పాటు బిగ్ బాస్ 3లో మీరా ఇతర సభ్యులకు పోటీ నిచ్చింది. అనేక వివాదాలతో మీరా మిథున్ షో నుంచి ఎలిమినేట్ అయింది. మీరా మిథున్ మోడల్ కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వివిధ రకాల డిజైనర్ డ్రెస్సులు, మోడరన్ అవుట్ ఫిక్స్ ధరిస్తూ మీరా మిథున్ చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. 

ఇక తరచుగా మీరా మిథున్ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం కూడా మీరా మిథున్ వర్థమాన మోడల్స్ కోసం అందాలపోటీ నిర్వహించాలని భావించింది. కానీ వివాదాల కారణంగా ఆ అందాల పోటీలు జరగలేదు. 

తాజాగా మీరా మిథున్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. తన ఫోటోలని కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్ లో పెట్టినట్లు మీరా సోషల్ మీడియాలో పేర్కొంది. అంతే కాదు తన డీటెయిల్స్, ఫోన్ నంబర్ కూడా అప్లోడ్ చేశారని మీరా మిథున్ వాపోయింది. 

ఇంత దారుణమైన సైబర్ నేరాలు జరుగుతుంటే తమిళనాడు పోలీసులు ఏం చేస్తున్నారని మీరా మిథున్ ప్రశ్నించింది.