Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు 'మోసగాళ్లు'.. సునీల్ శెట్టి డైనమిక్ లుక్!

వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

manchu vishnu upcoming movie mosagallu new look
Author
Hyderabad, First Published Feb 29, 2020, 7:04 PM IST

గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్ లో పోలీస్ యూనిఫామ్, తలకు సిక్కులు ధరించే 'టర్బన్'తో సునీల్ శెట్టి ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ఏసీపీ కుమార్.

manchu vishnu upcoming movie mosagallu new look

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణంగా భారత్ లో చోటుచేసుకొని, అమెరికాను సైతం వణికించిన యథార్థ ఉదంతం ఆధారంగా 'మోసగాళ్లు' సినిమా రూపొందుతోంది. సోమవారం నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జరగనుంది. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios