Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ నిజ జీవిత కఠోర వాస్తవాలతో వెబ్ సీరిస్

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి.

Manchu Vishnu's Chadarangam inspired from NTR's life
Author
Hyderabad, First Published Feb 18, 2020, 7:20 PM IST

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం నిర్మించారు. అదీ చెప్పుకోదగ్గ రీతిలో వర్కవుట్ కాలేదు. అయితే వాటిన్నటిలో అందరికీ తెలిసున్న విషయాలే చూపటం వల్ల ఇంట్రస్ట్ పుట్టలేదని, బయిట ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలను ప్రస్దావిస్తూ చదరంగం అనే టైటిల్ తో ఓ వెబ్ సీరిస్ రెడీ చేసారు.

మీడియాలో చెప్పుకునే దాన్ని బట్టి ఎన్టీఆర్ జీవితం లో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి కోణాల్ని.. కఠోర నిజాల్ని ఈ వెబ్ సిరీస్ లో ఓపెన్ గా చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ కి చదరంగం అనే టైటిల్ ని పెట్టడంతో ఏం చూపెట్టబోతున్నారా అనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదలయింది.  

ఈ ట్రైలర్ ని చూస్తే ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎన్టీఆర్ నాటి   రాజకీయ పరిస్థితులు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో అంటే ఎన్టీఆర్ గా కనిపించబోతున్నారట. అయితే డైరక్ట్ గా ఎన్టీఆర్ అనే ప్రస్దావిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగినీడు, కౌసల్య, సునయన వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు ...ఫలనా రాజకీయ నాయకుడుని టార్గెట్ చేస్తూ ఈ వెబ్ సీరిస్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో గెస్ చేయండి.

‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్‌ ఇస్తుంది’’ అని మంచు విష్ణు  చెప్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios