ఆ మధ్యన బాలయ్య, మంచు మనోజ్ కలిసి...ఊ కొడతారా..ఉలిక్కిపడతారా అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య అంటే మనోజ్ కు చాలా ఇష్టం. అలాగే బాలయ్య సైతం మంచు ఫ్యామిలీ అంటే ఇష్టపడతారు. ఇప్పుడు మనోజ్, బాలయ్య ఇద్దరూ ఒకే పాత్రను ఇష్టపడుతున్నారట. అదే అఘోరా. అవును...ఇప్పుడు మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వీళ్లద్దరూ ఒకళ్లకు తెలియకుండా మరొకరు ఒకే పాత్ర కమిటవ్వడం అంతటా చర్చనీయాశంగా మారింది.

బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆయన ఫస్టాఫ్ లో అఘోరా గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఆ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందని, అందుకోసం ప్రత్యేకమైన హోమ్ వర్క్ సైతం బోయపాటి చేసారని చెప్తున్నారు. దాంతో బాలయ్య అభిమానులంతా ...ఈ సినిమాతో తన హీరో హిట్ ట్రాక్ లో పడతారని ఎదురుచూస్తున్నారు. ఈ లోగా మంచు మనోజ్ సైతం అఘోరా పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసి షాక్ అయ్యారు.

2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు చిత్రం తరువాత మంచు మనోజ్ మరో చిత్రం చేయలేదు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తరువాత మనోజ్ ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ ఆయన హీరోగా తెరకెక్కించనున్నారు. వచ్చే నెల 6వ తేదీన గ్రాండ్ గా ఈ  చిత్రం ప్రారంభం కానుంది. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఐదు భాషలలో  భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రంలోని మనోజ్ రోల్  అఘోరాగా కనిపిస్తారట. పాత్రలో భాగంగా శవాలను తింటూ, సమాజానికి దూరంగా ఉండే అఘోరాగా మనోజ్ నటన నిజమా అనిపించేలా రియలిస్టిక్ గా ఉంటుందని, ఈ మేరకు రీసెర్చ్ సైతం చేసారని  సమాచారం. తమిళంలో అంటే అఘోరా పాత్ర తెరకెక్కింది కానీ తెలుగులో ఏ హీరో ధైర్యం చేయలేదు. ఇన్నాళ్లకు ఇద్దరు హీరోలు మొదటిసారి ఈ సాహసం చేస్తున్నారు.